Posts Tagged ‘dasari controversy’
దర్శకరత్న దాసరి నారాయణరావు ఈ రోజు మరలా నోరు పారేసుకుని వార్తల్లో వ్యక్తి అయ్యాడు. ఎప్పుడూ చిన్న సినిమా చిన్న సినిమా అని మొసలి కన్నీరు కార్చే దాసరి గారు ఇంకొక అడుగు ముందుకు వేసి – “ఆ మూడు, నాలుగు కుటుంబాల ఆధిపత్యం నుండి తెలుగు సినిమా పరిశ్రమని కాపాడండి” అని రోశయ్య ని వేడుకున్నాడు. ఇంతకీ ఎవరు ఆ ముగ్గురు, నలుగురు..?? ఇంకెవరు:
-
చిరంజీవి & అల్లు అరవింద్ (నిర్మాణం, సినిమా హాళ్ళు, టీవీ, సినిమా పంపిణీ…)
-
అక్కినేని కుటుంబం (స్టూడియో, నిర్మాణం…)
-
నందమూరి కుటుంబం
-
రామానాయుడు కుటుంబం
సినిమా బాగోకపోతే చిరంజీవి సినిమాకి అయినా రెండో రోజు ఎవరూ రారని దాసరి అన్నాడు. అవునా?? అందరి కళ్ళు తెరిపించిన దాసరి గారికి శతకోటి వందనాలు.వంగలేనమ్మ- ఇంకేదో అందంట… అలా ఉంది దాసరి పరిస్దితి. ఒక్కటంటే ఒక్క మంచి చిన్న సినిమా తీయటం చేత కాదు కాని… డబ్బులు సంపాదిస్తున్న వారిని చూసి వోర్వలేక ఏదేదో వాగితే విలువ ఉంటుందా ??
అయినా, ఎవరైనా ఒక మంచి చిన్న సినిమా తీసి – అది ఈ నలుగురు పెద్దల వాళ్ళ ఆడకపోతే – అప్పుడు మాట్లాడితే విలువ ఉంటుంది. నిజంగా మంచి సినిమా చూసి ఎన్నాళ్ళు అయ్యిందో?
ఇంకో నలుగురిని కూడా అని ఉండొచ్చు [నిర్మాణం, పంపిణీ...]:
- రామోజీ రావు
- దిల్ రాజు
- అల్లు అరవింద్
- దగ్గుబాటి సురేష్ బాబు
Tags: best telugu blogs, dasari controversy, dasari speech chiranjeevi, good telugu blogs, telugu cinema news, telugu gossips in telugu, telugu songs lyrics in telugu, top telugu blogs in india
