Posts Tagged ‘news in telugu’

Raviteja with Naresh & SivBalaji

Raviteja with Naresh & SivBalaji

  • రవితేజ ఇమేజ్ పక్కన పెట్టి కామెడి హీరోలైన అల్లరి నరేష్, సునీల్ తో సినిమా చేయటం. ఈ రీమేక్ సినిమాకి బెల్లంకొండ సురేష్ నిర్మాత. సినిమా పేరు: శంభో శివ శంభో! ఈ చిత్రంలో శివ బాలాజీ కూడా నటిస్తున్నాడు.

  • గొప్ప దర్శకుడైన సింగీతం శ్రీనివాసరావు నటుడి అవతారం ఎత్తడం. ఆయన అల్లు అర్జున్, గుణశేఖర్ ల తాజా సినిమాలో నటిస్తున్నారు.

  • చాలా రోజుల తర్వాత పెద్ద హిట్టు అయిన సినిమా మగధీర. సంతోషకరమైన విషయమే, కానీ, మగధీర దెబ్బకి వచ్చే రెండు మూడు వారాల్లో రిలీజు అవ్వాల్సిన ‘జోష్‘ లాంటి సినిమాలు వాయిదా పడేలాగా ఉన్నాయి.

  • ఆర్య దర్శకుడు: సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని గీత ఆర్ట్స్ కి చేయనున్నట్టు సమాచారం. హ్యాపీడేస్ జంట: వరుణ్ సందేశ్, తమన్నా ఈ సినిమాలో మళ్ళా కలిసి నటించే అవకాశం ఉంది.

  • పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాన్ని కమెడియన్ గణేష్ కి ఇవ్వడం తెలిసిందే. అయితే ముందుగా అనుకున్నట్టు ఈ సినిమాకి దర్శకుడు పూరి జగన్నాధ్ కాదు, తాజాగా ‘షాక్’ సినిమా దర్శకుడు: హరీష్ శంకర్ ఈ సినిమాకి దర్సకత్వం వహించనున్నారని సమాచారం!

Tags: , , , , , , , , , , , , , , , , , , , , , ,