Posts Tagged ‘telugu cinema news’

22
May

Will KRISHH overcome ** 2nd MOVIE SYNDROME ** ?????

   Posted by: admin    in Movies

There’s some thing known as “2nd Movie Syndrome” prevailing in Telugu Film Industry from many years. It’s nothing but: a DIRECTOR having a great debut (1st film) and his second film being a disaster/flop. There were many promising directors in the past who started well and weren’t able to show the same energy levels later on….

Director Jagarlamudi Krishh on sets!

KRISHH (Jagarlamudi Krishna) also had a dream debut as a director with GAMYAM and won many accolades, awards and rewards for his great work. Now, he is coming up with another multi-hero movie: VEDAM as his 2nd film and it’s getting released on June 3rd after few postponements. AUDIO has already spilled it’s magic on me and I’m eager to watch the film. VEDAM has Allu Arjun, Manoj, Anushka and Manoj Bajpai in lead roles. My favorite Music Director: MM KEERAVANI has given some soothing and scintillating tunes for this film. Keeping my fingers crossed for KRISHH’s success!

FYI: Other Directors who faced 2nd Movie Syndrome:

  • Sukumar (AARYA) –> Jagadam
  • Karunakaran (THOLI PREMA) –> Yuvakudu
  • AS Ravi Kumar Choudary (YAGNAM) –> Veerabadhra
  • Soorya Kiran (SATHYAM) –> Dhana 51
  • Uday Shankar (KALISUNDAM RAA) –> Prematho Raa!
  • Arun Prasad (THAMMUDU) –> Bhalevaadivi Baasu
  • Sri Vaas (LAKSHYAM) –> Raama Raama Krishna Krishna

And, there are few other directors who started with a super flop and went on to make it BIG in the industry. Examples include: Poori Jagannadh (BAACHI), Sreenu Vytla (NEE KOSAM), etc!

Tags: , , , , , , , , , , , , , , ,

దర్శకరత్న దాసరి నారాయణరావు ఈ రోజు మరలా నోరు పారేసుకుని వార్తల్లో వ్యక్తి అయ్యాడు. ఎప్పుడూ చిన్న సినిమా చిన్న సినిమా అని మొసలి కన్నీరు కార్చే దాసరి గారు ఇంకొక అడుగు ముందుకు వేసి – “ఆ మూడు, నాలుగు కుటుంబాల ఆధిపత్యం నుండి తెలుగు సినిమా పరిశ్రమని కాపాడండి” అని రోశయ్య ని వేడుకున్నాడు. ఇంతకీ ఎవరు ఆ ముగ్గురు, నలుగురు..?? ఇంకెవరు:

Four Families - Claimed by DASARI

  1. చిరంజీవి & అల్లు అరవింద్ (నిర్మాణం, సినిమా హాళ్ళు, టీవీ, సినిమా పంపిణీ…)

  2. అక్కినేని కుటుంబం (స్టూడియో, నిర్మాణం…)

  3. నందమూరి కుటుంబం

  4. రామానాయుడు కుటుంబం

సినిమా బాగోకపోతే చిరంజీవి సినిమాకి అయినా రెండో రోజు ఎవరూ రారని దాసరి అన్నాడు. అవునా?? అందరి కళ్ళు తెరిపించిన దాసరి గారికి శతకోటి వందనాలు.వంగలేనమ్మ- ఇంకేదో అందంట… అలా ఉంది దాసరి పరిస్దితి. ఒక్కటంటే ఒక్క మంచి చిన్న సినిమా తీయటం చేత కాదు కాని… డబ్బులు సంపాదిస్తున్న వారిని చూసి వోర్వలేక ఏదేదో వాగితే విలువ ఉంటుందా ??

అయినా, ఎవరైనా ఒక మంచి చిన్న సినిమా తీసి – అది ఈ నలుగురు పెద్దల వాళ్ళ ఆడకపోతే – అప్పుడు మాట్లాడితే విలువ ఉంటుంది. నిజంగా మంచి సినిమా చూసి ఎన్నాళ్ళు అయ్యిందో?

ఇంకో నలుగురిని కూడా అని ఉండొచ్చు [నిర్మాణం, పంపిణీ...]:

  • రామోజీ రావు
  • దిల్ రాజు
  • అల్లు అరవింద్
  • దగ్గుబాటి సురేష్ బాబు

Tags: , , , , , , ,

25
Mar

Latest TELUGU CINEMA Updates!

   Posted by: admin    in Movies, Telugu Content

  • ఇప్పుడే “మరో చరిత్ర” సినిమా చూసి వచ్చా… ఆహా ఏమి సినిమా గురూ! ఒక సినిమా ఎంత చెత్తగా ఉండాలో అంత చెత్తగా ఉంది. దిల్ రాజుకి పట్టిన శని ఇప్పటిలో వదిలే అవకాశం లేదేమో? హీరోయిన్ అనిత గురించే చెప్పకపోవడమే బెటర్, అసలే కళ లేని మొహం – దానికి తగ్గట్లు దారుణ మైన నటన. ఇంకా మన వరుణ్ గురించి చెప్పేది ఏముంది? ఇంకా నటన నేర్చుకునే దశ లోనే ఉన్నాడు మన తమ్ముడు… పాటల్లో పస లేదు.. కధనం లో కసి లేదు.. పనీ పాటా లేకపోతే ఈ “మరో చరిత్ర” సినిమా కి వెళ్ళండి!

  • పవన్ కళ్యాణ్ పులి” తర్వాత నిర్మాత గణేష్ కి చేయబోయే సినిమా చివరకి జయంత్ చేతికి చిక్కింది. హరీష్ శంకర్ నుండి విజయ్ భాస్కర్ చేతికి వెళ్లి – ఇప్పుడు అది ఎక్కడో ఉన్న జయంత్ దగ్గరికి చేరింది. జయంత్ అంటే తెలుసుగా : – ప్రేమించుకుందాం రా, శంకర్ దాదా లాంటి హిట్లు ఇచ్చిన పాత దర్శకుడు… పవన్ అన్నయ్య ఏ సినిమా ఎవరికి ఎందుకు ఇస్తాడో దేవుడికే తెలియాలి… ఇంకా పెద్ద కామెడి ఏంటంటే – ఈ సినిమా హిందీ హిట్టు “లవ్ ఆజ్ కల్” కి రీమేక్ అంట… హ హ హహ !

  • క్రికెట్ అనేది గనుక ఒక మతం అయితే – కచ్చితంగా సచిన్ టెండూల్కర్ దానికి దేవుడే! ఈ వయస్సులో కూడా కుర్రకారు కన్నా వేగవంతమైన, శక్తిమంతమైన ఆటని ప్రదర్శిస్తున్న ఆ దేవుడిని ఏమని పొగడాలి??? ఊరు ఏదైనా, స్టేడియం ఏదైనా, ప్రత్యర్ది ఎవరైనా జనం మాత్రం ఈ పిల్లోడు కనబడితే ఒకటే కేరింతలు… ఆడటం మొదలు పెట్టి ఇరవై ఏళ్ళు అయినా ఒకే రకమైన క్రేజ్ ని నిలబెట్టుకోవడం ప్రపంచంలో ఇంకా ఎవరికీ, ఎప్పటికీ సాధ్యం కాదు!

Tags: , , , , , , , , , , , , , , , , , ,

21
Feb

Latest Updates!

   Posted by: admin    in General

  • Akkineni NAGARJUNA‘s new film will be on the lines of Kandahar Hijack episode and the film’s shoot has already begun! The film is a bi-lingual made in Tamil & Telugu. Radha Mohan (directed Aakasamantha in the past) is directing this flick, Dil Raju produces the Telugu version while Prakash Raj produces it in Tamil. PAYANAM & WANTED are the titles under consideration…!
  • RAJAMOULI‘s next film with Suneel as it’s hero is already in progress. This low budgeted comic entertainer has Saloni (Chukkallo Chandrudu & Oka Oorilo fame) as the female lead and C.Ramprasad handles cinematography. MM.Keeravani is the music director for this flick. MARYAADHA RAAMANNA is the title that’s confirmed for this movie…!
  • Powerstar PAWAN KALYANs next film after the much delayed Puli would be with director: Vijaya Bhaskar. This film would see the best writer/director pair (Trivikram & Vijayabhaskar) coming together after many years. Comedian Ganesh Babu produces this film (for some unknown resons the earlier announced project with young director: Harish Shankar was called off)…!
  • It’s surprising to see Nandamuri Balakrishna coming up with a new movie one after the other. The latest on the block would be a new movie of Balayya in the direction of young talented director: SriVaas (debuted with Lakshyam). This film would be produced by S Krishna Prasad (Sridevi Arts).
  • K.Vishwanath‘s new film is titled as SUMADHURAM. It will have Allari Naresh as it’s hero and Manjari (Siddhu from SK fame) as the female lead. Happy to see KV making another new film after Swarabhishekam.

Tags: , , , , , ,

సచిన్ టెండూల్కర్: అసాధ్యమనుకున్న గెలుపు కలని తన ఒంటరి పోరుతో తీర్చబోయి చివరి అడుగులో తడబడటం తట్టుకోలేకపోతున్నా… మిగతా ఆటగాళ్ళు అందరు కలిసి సచిన్ (ఇండియా కూడా) ఓడిపోయే లాగ చేసినందుకు సిగ్గుపడాలి (ముఖ్యంగా జడేజా). టీం ఓడిపోవడం చూసి సచిన్తో పాటు కోట్లాది అభిమానుల గుండె పగిలి ఉండాలి. ఇప్పటికైనా సచిన్ తన సహచరుల మీద నమ్మకం తగ్గించుకుంటే ఇండియా కి మంచిది. నేను క్రికెట్ చూడటం మొదలు పెట్టిన రోజుల్లో లాగానే ఇంకా ఇంత భారాన్ని ఇష్టం తో మోస్తున్నందుకు సచిన్ ని క్రికెట్ కి “దేవుడు” అనాలా ఇంకేమన్నా అనాలా ????

తెలుగు టీవీ మీడియా: మెరుగైన సమాజం కోసం“…. ఈ మాట ఎక్కడో విన్నట్లు ఉంది కదా?? ఇది ఒక తెలుగు న్యూస్ చానల్ కాప్షన్. వారం రోజులుగా వీళ్ళు చేస్తున్న హడావిడి, హంగామా, కవరేజ్ చూస్తుంటే సిగ్గేస్తుంది. సినిమా హీరో రాజశేఖర్ & జీవిత ని స్టూడియో కి పిలిచి, రెచ్చకొట్టి, లేని పోని విషయాలు తవ్వి – వాళ్ళు చిరంజీవి ని అడ్డమైన మాటలు అనేవరకు పుల్ల పెట్టి, ఆ తంతుని “లైవ్ షో” అని టెలికాస్ట్ చేస్తున్న వాళ్ళని ఏమనాలి. దాని వల్ల జరిగేది ఒక్కటే – అభిమానులు రెచ్చిపోయి ఎమన్నా చేస్తే (నిరసనలు, బెదిరింపులు….), చక్కగా దానిని రికార్డ్ చేసి ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేస్తే వాళ్లకి వచ్చే సునకానందం ఇంతా అంతా కాదేమో. ఎంత బాధ్యతా రాహిత్యమో కదా…

రాష్ట్ర కాంగ్రెస్: రాష్ట్రం రావణ కాష్ఠం లా రగిలిపోతుంది. మనం వోట్లు వేసి ఎన్నుకోని నాయకులు, ఎన్నికల్లో నిలబడితే డిపాజిట్ కూడా రాని పనికిమాలిన వ్యక్తులు మన రాష్ట్రాన్ని పరిపాలించడం చూస్తూ బాధతో నిస్సహాయం గా నిలబడటం తప్ప ఏమి చేయలేకపోతున్నాం. మాటకి ముందు మాటకి వెనకాల ఈ చేతకాని దద్దమ్మ లు వాడే పదాలు ఎంటయ్యా అంటే: “మేడం”, “అమ్మ”, “అధిష్టానం”…. సోనియా ఎవడికి అమ్మ నాయనా?? మీకా ?? రాష్ట్ర ప్రజలకా?? బాధ్యతలు గాలికి వదిలేసి అమ్మ చుట్టూ అధికారం కోసం ప్రదిక్షణలు ఇంకా ఎన్నాళ్ళు చేస్తారో?

చిరంజీవి & ప్రజారాజ్యం: చిరంజీవిని చూస్తుంటే జాలి వేస్తుంది. చిరు కి ఉన్న కోరిక ఏమిటో, ఆశయం ఏమిటో ఆయనగారికే తెలియాలి. మాతో కలిస్తే ఎప్పటికైనా ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ లో ఒక వర్గం అనగానే ఆ వలలో చాలా తేలిగ్గా చిరు పడిపోయి ఈ రోజు గిలగిలలాడటం చూస్తుంటే నవ్వు వస్తుంది. జీవితం లో అన్నీ ఉన్నా పదవి మీద ఎందుకో ఇంత పిచ్చి. అండగా ఉంటామన్న అభిమానుల్ని పట్టించుకోకుండా వలస వాదుల్ని అందలం ఎక్కించి ఇప్పటికే అతి పెద్ద తప్పు చేసాడు అన్నయ్య. ప్రజల్లో మిగిలి ఉన్ననమ్మకాన్ని కూడా పోగుట్టుకునే దిశలో అడుగులు వేస్తున్నట్లు ఉంది ప్రజారాజ్యం పార్టీ…! చిరు కాంగ్రెస్ తో కలిస్తే మా పవన్ ఇప్పుడు ఎవరి మీద పోరాడాలి.

తెలుగు సినీ పరిశ్రమ: కోట్లకి కోట్లు సంపాదన, నిరంతర ఆదాయం, ప్రజల బలహీనతల్ని సొమ్ము చేసుకోవాలనే అత్యాశ: ఇవన్నీ మన సినిమా వాళ్ళ గుణాలు. “దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్లు“, వరద భీబత్సం జరిగి నెల అయ్యాక ఇప్పుడేదో ఆడి, పాడి, రంజింప చేస్తే టిక్కెట్ల రూపం లో జనాలు ఇచ్చే డబ్బుల్ని పోగేసి విరాళాల రూపం లో మళ్ళా అదే పిచ్చి జనాలకి ఇచ్చి సేవ చేస్తారంట. పిచ్చ కామెడి గా ఉంది. ఏర్పాట్లు, బద్రత, ట్రాఫిక్ జామ్లు, మీడియా కవరేజి, మూడు రోజుల సెలవులు – వచ్చే ఆదాయం వీటికే సరిపోద్ది. ఎవరికీ వారు సహాయం చేస్తే ఎంత బాగుండేదో కదా? మన జేబులో నుండి ఒక్క రూపాయి తీయాలంటే ఎంత నరకమో వీళ్ళకి. ఈ తెలివి సినిమా ప్రేక్షకుడికి వచ్చి ఎవరూ టిక్కెట్లు కొనకపోతే పరిశ్రమకి వచ్చే నష్టం లెక్క కట్టలేనిది. నిజమైన సమాజ సేవ ఎప్పుడు చేస్తారో చూడాలి…!

Tags: , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,