Posts Tagged ‘telugu songs lyrics’

15
Jun

Telugu SONG on “Saving Earth/Trees”

   Posted by: admin    in Music


Earth SONG in TELUGU

Tags: , , , , ,

13
Nov

LYRICS of some great OLD TELUGU SONGS

   Posted by: admin    in Movies, Music

JAMUNA in one of the songs

JAMUNA in one of the songs

ANR & JAMUNA ‘s Romantic Song:

వెన్నెలలోనే వేడి ఏలనో, వేడిమిలోనే చల్లనేలనో.. ఈ మాయ ఏమో జాబిలీ….ఈ మాయ ఏమో జాబిలీ….

వెన్నెలలోనే విరహమేలనో, విరహములోనే హాయి ఏలనో.. ఈ మాయ ఏమో జాబిలీ….ఈ మాయ ఏమో జాబిలీ….

మొన్నటి కన్నా నిన్న వింతగా, నిన్నటి కన్నా నేడు వింతగా… హో హో హో…

మొన్నటి కన్నా నిన్న వింతగా, నిన్నటి కన్నా నేడు వింతగా…

నీ సొగసూ, నీ వగలూ.. హాయి హాయిగా  వెలసేనే…… ||వెన్నెలలోనే||

రూపము కన్నా చూపు చల్లగా, చూపుల కన్నా చెలిమి కొల్లగా… హో హో హో…

రూపము కన్నా చూపు చల్లగా, చూపుల కన్నా చెలిమి కొల్లగా…

నీ కళలూ, నీ హొయలూ చల్ల చల్లగా విరిసేనే…… ||వెన్నెలలోనే||

KIDS’ Praying GOD about their Father:

పిలిచిన పలికే దేవుడివయ్యా వెంకటేశ్వరా

ఈ దీనుల కాచి తోడుగా నిలిచి దారి చూపరా…స్వామీ జాలి చూపరా… ||పిలిచిన పలికే||

కన్నతల్లియే కరువైపోయిన చిన్నవాడురా, తండ్రి ప్రేమకై రేయీ పగలూ తల్లడిల్లెరా…..||కన్నతల్లియే||

లేత మనసులో మూగ వేదన ఆలకించరా… స్వామీ ఆధరించరా…… ||పిలిచిన పలికే||

ఏడుకొండలా శిఖరం మీద ఉన్న దేవుడా… మా నాన్న గుండెలో కాసేపైనా ఉండకూడదా….||ఏడుకొండలా||

మనసును మార్చి మమతలు పెంచీ మమ్ము కలపరా… నీలో మహిమ చూపరా …. ||పిలిచిన పలికే||

Sentiment song about WOMAN’s LIFE:

ఊరు మారినా, ఉనికి మారునా… మనిషి దాగినా, మమత దాగునా……||ఊరు మారినా||

మరలి రాని పయనంలో మజిలీ లేదూ…. ఊఁ ఊఁ ఊఁ.. ఆడదాని కన్నీటికి అంతే లేదూ… ||ఊరు మారినా||

అనురాగ దీపం, అసమాన త్యాగం… స్త్రీ జాతి కొరకే సృజియించె దైవం..

చిరునవ్వులన్నీ పెరవారికోసగి, చీకటులలోనే జీవించు యువతీ..

తలపులే వీడవు, వీడేది మనిషే…. వలపులే వాడవు, వాడేది తనువే……||ఊరు మారినా||

మగవానికేమో ఒకనాటి సుఖమూ, కులకాంతకదియే కలకాల ధనమూ…

తన వాడు వీడా, అపవాదు తోడా… పది నెలల మోత, చురకత్తి కోత…

సతులకే ఎందుకు ఈ ఘోర శిక్ష, సహనమే స్త్రీలకు శ్రీరామ రక్షా… ||ఊరు మారినా||

Tags: , , , , , , , , , , , , , , ,